రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పాలన అందిస్తోందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. విజయవాడలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీకి రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం వెనుక ప్రధాని మోదీ సహకారం ఉందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రం సీఎం చంద్రబాబు వల్ల ఆర్థికంగా పుంజుకుందని కొనియాడారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు.
Post Views: 162








