అధికారంలో ఉన్న పార్టీలోకి నేతలు వస్తుంటారు.. పోతుంటారు.. కార్యకర్తలు అవేమీ పట్టించుకోవద్దని మంత్రి సీతక్క అన్నారు. గాంధీ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన మంత్రి కులగణన చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతం కోసం కృష్టి చేయాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలని, అలా అందేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇదే తరుణంలో ఎన్నికల వేళ పార్టీలోకి కొందరు వస్తుంటారు, పోతుంటారు.. అలాంటి వారి గురించి కార్యకర్తలు పట్టించుకోవద్దని, పార్టీ కోసం పనిచేసిన వారికే గుర్తింపు, పదవులు ఉంటాయని అన్నారు.
Post Views: 164








