నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రకటనతో అధికార పార్టీలోని పలువురు నేతలు ప్రయత్నాలను వేగవంతం చేశారు. పీసీసీ కార్యవర్గ సమావేశం సందర్భంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 10 లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో గత కొన్నాళ్ళుగా పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు తమ తమ ప్రాంతాలలోని ఎమ్మెల్యేల వద్దకు పరుగులు పెడుతున్నారు. పదేళ్ళుగా పార్టీ కోసం పని చేసిన వైనంతో పాటు బీఆర్ఎస్ తో ఎదుర్కొన్న ఇబ్బందులను మరోసారి గుర్తు చేస్తూ నామినేటెడ్ పోస్టులకు సిఫార్సు చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఖాళీగా ఉన్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు జిల్లా స్థాయి పదవులనూ భర్తీ చేస్తామని, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోస్టులకు డిమాండ్ దేవాలయ కమిటీలను నియమిస్తామని సీఎం ప్రకటించారు. అగదే విధంగా గ్రంథాలయ, వక్స్, ఆత్మ కమిటీలకు కూడా స్థానిక నేతలతోమే భర్తీ చేయనున్నామని సంకేతాలను ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంత మంది ఆషావహులు ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు ఎమ్మెల్యేల వద్దకు క్యూ కడుతున్నారు. జిల్లాల్లో మార్కెట్ కమిటీ పాలక వర్గాలు, దేవాలయాల కమిటీలతో పాటు జిల్లా గ్రంథా లయ సంస్థల చైర్మన్, డైరెక్టర్ పదవులు చాలానే ఉంటాయి. వీటితోపాటు వర్ఫ్ బోర్డు జిల్లా పాలక వర్గాలు, ఆత్మ కమిటీలు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పాలక వర్గాలను నామినేషన్ పద్ధతిలో భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఈ పజదవులన్నీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు రాష్ట్ర స్థాయి నేతల సూచనల మేరకే భర్తీ చేసే అవకాశాలుంటాయి. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు స్థానిక ఎమ్మె ల్యేలు, మంత్రుల వద్దకు క్యూ కడుతు న్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి లు స్పష్టత ఇవ్వడంతో ఇదే సరైన సమయమని ద్వితీయ శ్రేణి నేతలు భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జర గనున్న నేపథ్యంలో ఈ సారి పదవుల కేటాయింపు ఆసక్తికరంగా మారింది. నామినేటెడ్ పదవులు పొందిన వారు స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సి ఉంటుంది. అలా సత్తా ఉన్న వారికే పదవులు దక్కే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొదటి నుంచీ పార్టీ కోసం పని చేసిన వారికే ప్రాధాన్యం ఉంటుందని నేతలు స్పష్టం చేయడంతో పదేళ్ళు అధికార బీఆర్ఎస్ పై జరిపిన పోరాటాలు, చేసిన ఉద్యమాలను కూడా ప్రజా ప్రతినిధుల ముందు ఆషావహులు గుర్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను కూడా పార్టీ పరిగణనలోకి తీసుకునే అవకాశాలుండటంతో ఆ కోణంలో కొంత మంది ప్రయత్నాలను ప్రారంభించారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జిల్లాల స్థాయిలో జరగబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం ఏర్పడింది. అందివచ్చిన అకాశాన్ని ఏ మాత్రం జారవిడుచుకోవద్దన్న సంకల్పంతో ఉన్న చాలా ణంది తమ తమ నాయకుల ముందు మనసులోని మాటను బహిర్గతం చేస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో జిల్లాలలోని ప్రజా ప్రతినిధుల నివాసాలు, అధికారిక కార్యాలయాలలో మరోసారి సందడి వాతావరణం నెలకొంది.








