కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌తో కిషన్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని, అందుకే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీద ప్రేమ ఉండొచ్చు.. కానీ అభివృద్ధి విషయంలో కాళ్ళు లాగే పని చేయొద్దని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కేంద్ర మంత్రిగా ఆరేళ్ళు, అంతకు ముందు కూడా ఢిల్లీీలో కీలక భూమిక పోషించిన కరిషన్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన నిధులు, అమలవుతున్న పథకాల కోసం కావాల్సిన సహకారంపై చర్చ చేశారా ? అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకి ఏం ఇచ్చింది అంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పదవి ఇచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ నెంబర్ వన్ అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఓటేస్తేనే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కిందని, ఆ మాత్రం కృతజ్ఞత కూడా ఆయనకు లేదన్నారు. తన రహస్య మిత్రుడు కేసీఆర్ సూచనలు, శలహాల మేరకే కిషన్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని విరుచుకు పడ్డారు.
మూసీ ప్రక్షాళన విషయంలో రాష్చట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి మద్దతు లేదని, పైగా మూసి ప్రక్షాళన విషయంలో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ట్రిపుల్ ఆర్ వద్దా..? స్కిల్ యూనివర్సిటీ వద్దా..? అని అడిగారు. కేసీఆర్ కులానికి చెందిన రామ్మోహన్ నాయుడిని తెలంగాణకి తీసుకు వచ్చి కేసీఆర్‌ను పొగిడే పనిని కిషన్ రెడ్డి చేయించారన్నారు. ఎయిర్ పోర్టులు ఎవరిస్తారు.. సీఎం రేవంత్ అనేక పర్యాయాలు మోడీని కలిసి అడిగితే ఇచ్చారన్నారు. కిషన్ రెడ్డి.. మీరు తెలంగాణ బిడ్డ కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. తాను ఫట్టించుకోకపోగా పట్టించుకుని ముందుకు వెళ్ళాలనుకునే రేవంత్ రెడ్డిని అడ్డుకుంటున్నారని, ఇది శరైన పద్దతి కాదన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్, కిషన్ రెడ్డిలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన విధంగా బుద్ది చెప్పడం ఖాయమన్నారు.








