Mahaa Daily Exclusive

  మాకు ఎమ్మెల్సీ కావాలి పీసీసీ చీఫ్ ను కలిసిన సీపీఐ నేతలు…!

Share

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. నోటిఫికేషన్ వెలువడటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీలో తమకు ఓ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ మిత్ర పక్షాలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. సీపీఐ రాష్ట్ర నేతల బృందం సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీనియర్ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, పల్లె నర్సింహ తదితరులు పీసీసీ చీఫ్‌ను కలిశారు. తమ పార్టీ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు.