తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త సమీకరణాలను సూచిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ వచ్చిన తరువాత ఆసక్తి కర అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే ఒక స్థానం దక్కిచుకుంది. బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన లో ఉన్నారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పార్టీల్లో కొత్త చర్చ మొద లైంది. భవిష్యత్ రాజకీయాల పై అంచనాలు పెరుగుతున్నాయి. ఫలితాలతో కొత్త మలుపు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. టీచర్స్ స్థానం ఒకటి బీజేపీ దక్కించుకుంది. మార్చి 27వ తేదీన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయం సాధించారు. ఇక నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ గెలుపు ఆయన విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో రెండు స్థానాల ఫలితాలు తేలిపోయాయి. వాటి విజేతలు ఎవరో తేలిపోయింది.
బీజేపీకి ఒక స్థానం అందులో ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తొలిసారి బీజేపీ బోణి కొట్టింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు పోలైయ్యాయి. ఇక 12081 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కొమురయ్య అవలీలగా దాటారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 13,969 ఓట్లు సాధించిన శ్రీపాల్ రెడ్డి.. 19వ రౌండ్ లో తాజా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై విజయం సాధించారు. తనకు దక్కిన విజయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవమని శ్రీపాల్ రెడ్డి చెప్పారు. ఇది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇచ్చిన తీర్పు అని తెలిపారు. రాష్ట్రంలో పాఠశాల, ఉన్నతవిద్య కోసం కృషి చేస్తానని, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలపై పోరాడతానని ఆయన ప్రకటించారు.
మరోవైపు కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్ కొనసాగుతోంది. రేపటి వరకు ఫలితం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు సిబ్బంది గుర్తించారు. గ్రాడ్యుయేట్లు ఈ తరహాలో చెల్లని ఓట్లు వేయటం ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్ధులకు టెన్షన్ పెంచుతోంది. ఈ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. రాష్ట్రంలో కొంత కాలంగా చోటు చేసుకుంటు న్న పరిణామాలు.. తాజాగా క్షేత్ర స్థాయిలో పబ్లిక్ మూడ్ తో పార్టీలు సమీక్షలకు సిద్దం అవుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఫలితం తరువాత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








