మహా: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల
బాలకృష్ణప్రసాద్(76) గారు కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
ఆయన వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలండ్రాల పెండ్లికూతురు తదితర కీర్తనలకు ఈయనే స్వరాలు సమకూర్చారు.
గరిమెళ్ల మృతి పట్ల తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు సంతాపం తెలిపారు.
Post Views: 51








