నల్లగొండ, మహా
ఒకటి కాదు.. రెండు కాదు.. రాష్ట్రస్థాయిలో ఐదు ఎమ్మెల్సీలు ఉంటే ఒకేసారి నాలుగు ఎమ్మెల్సీలు అక్కడి వారికే దక్కబోతున్నాయి. ఇది కదా అదృష్టం అంటే అని అక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుండి రెండుసార్లు పోటీచేసిన అద్దంకి దయాకర్ ను, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ లను ఎంపిక చేసింది. ఇక పొత్తులో ఒక స్థానం సీపీఐకి ఇవ్వగా పార్టీ అనేక సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం విస్తరణ వ్యూహాల రీత్యా నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శి నెల్లికంటి సత్యంను ఎంపిక చేసి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. దీంతో ఒకప్పటి కమ్యూనిస్టు జిల్లాలైన ఖమ్మం, నల్లగొండలలో సీపీఐ వ్యూహాత్మకంగా పూర్వవైభవం దిశగా సాగేందుకు ఈ ఎంపిక చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు దక్కనుండగా, అది కూడా నల్లగొండ జిల్లా బిడ్డ, దాసోజు శ్రావణ్ ను కేసీఆర్ ఎంపిక చేశారు. దీంతో అన్ని దారులూ.. నల్లగొండ నేతలకే ఓటేశాయి. దీంతో నల్లగొండ జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, సీపీఐ పార్టీల క్యాడర్ లో ఉత్సాహం కనబడుతోంది.
…








