Mahaa Daily Exclusive

  ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు….!

Share

 

అమరావతి, మహా

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తేల్చేసింది టీడీపీ. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించింది. కావలి గ్రీష్మ(ఎస్సీ), బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ)కు అవకాశం కల్పించారు. మరో సీటును చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించారు. ఇప్పటికే ఒక స్థానం జనసేనకు కేటాయించగా.. ఆ పార్టీ నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేశారు. బిజెపి తరుపున సోము వీర్రాజు పేరును బీజేపీలోని కొందరు పెద్దలు ఎమ్మెల్సీ స్థానానికి ప్రతిపాదిస్తోన్నట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన పీసీఎన్ మాధవ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సోమవారం స్పష్టత రానుంది.