మార్చి 12వ తేదీన వైసీపీ తలపెట్టిన ‘యువత పోరు’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వైసీపీ ముఖ్యనేతలు, విద్యార్థి నాయకులతో టెలికన్ఫరెన్స్లో సజ్జల మాట్లాడారు. ఫీజు రీయంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడదామని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు
Post Views: 51








