Mahaa Daily Exclusive

  రామగుండం ఎయిర్ పోర్ట్ సాధ్యం కాదు ఎంపీ వంశీకృష్ణ వినతిపై కేంద్రమంత్రి లేఖ…!

Share

రామగుండంలో ఎయిర్‌పోర్టు పెట్టాలనే అంశంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు లేఖ రాశాడు. పెద్దపల్లిలోని రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. కొండప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సాధ్యం కాదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపినట్లు లేఖ ద్వారా తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో డొమెస్టిక్ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాలని గత సంవత్సరం నవంబర్ లో కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ ప్రతిపాధన పెట్టారు. దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై వివరణ ఇచ్చారు.