Mahaa Daily Exclusive

  అప్పుడు తులం బంగారం అన్నారు ఇప్పుడు ఊరూరా బెల్టు షాపులు తెరిచారు బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి…!

Share

కోటి మంది మహిళలను కోటిశ్వర్లను చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి 15 నెలల్లో ఎంత మందిని కోటీశ్వరులను చేశారో చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని మహిళలు భావిస్తున్నారన్నారు. మహిళలకు నెలనెలా ఇస్తామన్న రూ. 2500 హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. బీజేపీ మాత్రమే మహిళా సాధికారతకు కట్టుబడి ఉందన్నారు. మహిళలను గౌరవించి వారికి ఉన్నత పదవులను ఇవ్వడంతో ఫాటు వారి సంక్షేణం కోసం నిరంతరం కృషి చేస్తున్నది కేవలం బీజేపీయేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలు అంటే ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలే తప్ప మిగతా వారు కారన్నారు. రేవంత్ రెడ్డిని అన్నగా భావిస్తే మహిళలకు కడుపుకోతే మిగులుతుందని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీకి రేవంత్ రెడ్డి బానిసగా మారారని అన్నారు. ఎన్నికలకు ముందు మహిళలను మహరాణులను చేసతామని తులం బంగారం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు థులం బంగారం ఇవ్వకపోగా ఊరూరా బెల్టుషావులు తెరిచి మహిళల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బెల్టు షాపుల పేరుతో అనేక మంది తాలి బొట్లు తెంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామన్న ముఖ్యమంత్రి గడచిన 15 మాసాల కాలంలో ఒక్క మహిళనైనా పారిశ్రామిక వేత్తను చేశారా అని నిలదీశారు. 600 బస్సులు ఇస్తామని చెప్పి కేవలం 20బస్సులే ఇచ్చారన్నారు. .