Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్ తెస్తా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన…!

Share

ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్ ను ఖచ్చితంగా తీసుకొస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. వరంగల్ కు ఎయిర్ పోర్ట్ తెచ్చిన. తర్వాత ఆదిలాబాద్ కు తీసుకొస్తా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డే తెచ్చిండంటరు. నాకే మంచిపేరొస్తది. తీసుకొస్తా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రమంత్రికి వివరించి, రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నం. తెలంగాణలో ఒకటే ఎయిర్ పోర్ట్ ఉండే. ఇపుడు వరంగల్ తెచ్చినం. తర్వాత ఆదిలాబాద్ తీసుకొస్తం అని సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. హరీష్ కూడా పలు సమస్యలు అడిగాడని వీలైనవి చేశామన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తమ ఎయిర్ పోర్ట్ ముందు వరుసలో ఉండేదని, ఎవరో కుట్రచేస్తున్నట్లు అనిపిస్తోందని అన్నారు. కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కోసం కూడా ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలని కూనంనేని కోరారు.

కంది శ్రీనివాసరెడ్డి హర్షం
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ సాధనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడపై ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో తెలంగాణకు కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయని, పదేళ్ళు మోదీ, కేసీఆర్ లు ఉన్నా.. ఆదిలాబాద్ కు ఒరిగిందేమీ లేదని, సీఎం రేవంత్ నాయకత్వంలో ఆదిలాబాద్ కు అద్భుత అవకాశాలు కనబడుతున్నాయన్నారు. ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్ కల త్వరలోనే సాకారమవుతుందన్నారు. ఎయిర్ పోర్ట్ వస్తే ఆదిలాబాద్ వ్యాపార, వాణిజ్యపరంగా మరింత ముందుకెళ్తుందని.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
…….