ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆదివారం బీజేఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని మండిపడ్డారు. అదే సమయంలో రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ చేసిన ఏకపాత్రాభినయం నిన్న అసెంబ్లీలో చూశామన్నారు. రేవంత్ కాలేజీ రోజుట్లో ఇలాంటి ఏకపాత్రాభినయం చేసినట్లున్నాడని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే.. ఎక్కడా సమాధానం చెప్కకుండా దాటవేశారని మండిపడ్డారు.జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించిందని, పసలేని, స్కూలర్ లేని ఏకపాత్రాభినంయ మాత్రమే రేవంత్ చేశారన్నారు. శాసనసభలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ హామీ ఇచ్చారని, ఏ హామీలు గెలిపించాయో.. ఆ గ్యారెంటిలకే చట్టబద్ధత లేకుండా పోయిందన్నారు. సభ ఇంకా కొనసాగుతోందంటూ 6 గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా? అని అడిగారు. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉందని ఏలేటి వ్యాఖ్యానించారు. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? ఇంకా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది చెప్పాలన్నారు. రుణమాఫీ పూర్తిచేశామని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని ఏలేటి మండిపడ్డారు.








