మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు ప్రవేశించాడు. జూబ్లీహిల్స్‌లోని డీకే అరుణ నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఇంట్లోని కిచెన్, హాల్ ఇలా పరిసర ప్రాంతాలన్నీ కలియతిరిగాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, కిచెన్ విండో తొలగించి ఆగంతకుడు లోనికి ప్రవేశించినట్లు తెలిసింది. గంటకుపైగా ఇంట్లో కలియతిరిగినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే డీకే అరుణకు ఈ విషయాన్ని చేరవేశారు. డీకే అరుణ అప్రమత్తమై వెంటనే ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయగా సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆగంతకుడు ఇంట్లోకి చొరబడిన సమయంలో డీకే అరుణ అక్కడ లేనట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. శనివారం సాయంత్రం వరకు నియోజకవర్గంలోని పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ రాత్రి మహబూబ్ నగర్ లోనే ఉన్నారు.








