కేరళ తరహాలో అరకును అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రజలు కోరగా.. అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతుగా రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు.
Post Views: 75








