ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయని, అవకాశాలు వినియోగించుకోవడంలో ఏపీ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయన్నారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్లమని, ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఒక్కో బ్యారల్ ముడి చమురు 60 డాలర్ల వరకు ఉందన్నారు.
Post Views: 141








