Mahaa Daily Exclusive

  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ చార్జీల పెంపునకు సిద్దం భారీ నష్టాలలో ఉన్న మెట్రో …!

Share

హైదరాబాద్ మెట్రో ప్రజలకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. మెట్రో చార్జీల పెంపుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నష్టాల బాటలో కొనసాగుతున్న మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ ఇవ్వబోతోంది. రైల్వే ప్రయాణికులకు చార్జీల పెంపు చేయడానికి ఎల్ అండ్ టి సంస్థ సిద్ధమవుతున్నట్టు సమాచారం. 6,500 కోట్ల భారీ నష్టాలలో మెట్రో హైదరాబాద్ మెట్రో సేవలను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ అయిన ఎల్ అండ్ టి మెట్రో రైలు లిమిటెడ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. మెట్రో కారణంగా భారీ నష్టాలను చూస్తోంది. ఇప్పటివరకు సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం దాదాపు 6,500 కోట్ల భారీ నష్టాలలో మెట్రో ఉన్నట్టు సమాచారం. గతంలోనే ఛార్జీల పెంపు ప్రతిపాదన కరోనా మహమ్మారి సమయంలో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోవడంతో మెట్రో సేవలు అందించకపోవడంతో మెట్రో ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుంది. ఆ సమయంలోనే మెట్రో ఛార్జీలను పెంచాలని మెట్రో రైలు నిర్వహణ సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అసలే ప్రజలు కరోనా కష్టాలలో ఉంటే మెట్రో రైలు చార్జీలు పెంపు చేయడం మంచిది కాదనే అభిప్రాయంతో సంస్థ అభ్యర్థనకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో చార్జీల పెంపు నిర్ణయం వాయిదా పడింది. ఇక తాజా పరిణామాలతో ఎల్ అండ్ టి సంస్థ ఇప్పుడు చార్జీల పెంపు తప్పనిసరి అని గట్టిగా భావిస్తోంది. ఇటీవల బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ చార్జీలను ఏకంగా 44 శాతం పెంచింది. నష్టాల నుంచి బయటపడటం కోసం బెంగళూరు మెట్రో రైలు బాటలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ సంస్థ ఆలోచిస్తుంది. నష్టాల నుంచి బయటపడడానికి ఎంత మేరకు చార్జీలను పెంచాలన్న దానిపైన తీవ్రంగా ఆలోచిస్తోంది. కొత్తగా చార్జీల పెంపునకు ఫిక్సేషన్ కమిటీ వేయనక్కరలేదని, టిక్కెట్టు ధరల సవరణకు ప్రభుత్వ అనుమతి కూడా అక్కరలేదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే చార్జీల పెంపునకు ముందుగానే మెట్రో ప్రజలకు అందిస్తున్న కొన్ని ముఖ్యమైన రాయితీలను సైలెంట్ గా తొలగిస్తున్నట్టు పేర్కొంది. 59 రూపాయల హాలిడే సేవర్ కార్డును మెట్రో రద్దు చేసింది. మెట్రో కార్డు వినియోగించే వారికి రద్దీ సమయాలలో ఇచ్చే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ను కూడా తీసేసింది. చార్జీల పెంపు ప్రకటన మెట్రో సంస్థ నుంచి ఒకటి రెండు రోజులలో వెలువడే అవకాశాలున్నాయి.