కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణాల అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తుది దశ విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులను ప్రశ్నించిన కమిషన్ దాని ఆధారంగా 300 పేజీలకు పైగా నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాదాపు 90 శాతం రిపోర్టు పూర్తిచేసిన కమిషన్ ఎన్‌డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తది నివేదిక కోసం ఎన్డీఎస్ఏకు మరోసారి లేఖ రాసింది. ఆ నివేదిక మరో మూడు వారాల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టును అందజేయనుంది.
Post Views: 101








