మహా భద్రాచలం
ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా బజాజ్ పల్సర్ బండిలో గోదావరిఖని కి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి అక్రమ రవాణా సమాచారం మేరకు, కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ భద్రాచలం లోని కూనవరం రోడ్డు లో తనిఖీలు చేపట్టి అక్రమ రవాణా గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ద్విచక్ర వాహనం (బజాజ్ పల్సర్) మరియు ఎండు గంజాయిని, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. గంజాయి తూకం వేయగా 17.5 కేజీలు ఉన్నట్లు దాని విలువ 8.75 లక్షలుగా నిర్ధారించారు.ఈ తనిఖీల్లో ఎస్.ఐ గౌతమ్ సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, వెంకట నారాయణ, సుమంత్, శ్రావణి, పార్థసారథి, రమేష్ పాల్గొన్నారు.
Post Views: 25








