Mahaa Daily Exclusive

  ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తున్నాం ధాన్యం కేంద్రాలను పరిశీలించిన డీఎం శ్రీలత..!

Share

కూసుమంచి, మే 7, మహా:
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేశామని, అన్ని కేంద్రాలకు మిల్లులు, లారీలను ఏర్పాటు చేశామని, సరిపడిన బ్యాగులను అందించామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జి. శ్రీలత తెలిపారు. బుధవారం కూసుమంచి మండలంలోని చేగొమ్మ, జీళ్లచెరువు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లయిస్ డీఎం శ్రీలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉన్నయా అని అడిగి తెలుసుకున్నారు. బస్తాలు, లారీలను అవసరానికి అనుగుణంగా పంపిస్తామని తెలియజేశారు. తేమ శాతం రాగానే కాటాలు వేయించి కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని సెంట్రల్ ఇంచార్జ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాణి, ఏఈఓ రవీందర్ రైతులు పాల్గొన్నారు.