Mahaa Daily Exclusive

  ఆడబిడ్డ ఇంటికి మహాలక్ష్మి దేవునితండాలో మా ఇంటి మణిదీపంలో పాల్గొన్న డీఎం..!

Share

కూసుమంచి, మే 7, మహా:
ఆడబిడ్డ జన్మించడం అంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి పుట్టినట్లేనని పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి, సివిల్ సప్లే జిల్లా మేనేజర్ జి. శ్రీలత అన్నారు. కూసుమంచి మండలం కేశ్వాపురం పంచాయతీ శివారు దేవుని తండాకు చెందిన వడ్తియా స్వాతి, నాగరాజు దంపతులకు ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈమేరకు జిల్లా కలెక్టర్ ముజ్ములిఖాన్ ఆదేశానుసారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టే “మా ఇంటి మణిదీపం” అనే కార్యక్రమం దేవుని తండ గ్రామంలో నిర్వహించారు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన వడిత్య స్వాతి నాగరాజ దంపతులను తిరుమలాయపాలెం ప్రాజెక్టు సిడిపిఓ కవిత, జిల్లా స్పెషల్ ఆఫీసర్ శ్రీలత, శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ బుల్లి, నిర్మల, పద్మ, ప్రభావతి, లక్ష్మీబాయి, ఆశా కార్యకర్త అలాగే ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి , పంచాయతీ సెక్రెటరీ, ఏఎన్ఎం, గ్రామంలో ఉన్న పెద్దలు హాజరయ్యారు….