ఖమ్మం – మహా.
ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత సైన్యం చేపట్టిన వైమానిక దాడులను బిఆర్ఎస్ పార్టీ గట్టిగా స్వాగతించింది.ఈ మేరకు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ , మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు బుధవారం ఖమ్మం తెలంగాణ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా తాతా మధుసూదన్ మాట్లాడుతూ —
“పాకిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్‌కు శత్రుత్వపూరితంగా వ్యవహరిస్తోంది. దేవాలయాలపై, పార్లమెంట్‌పై, సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు పాక్ ప్రేరణ స్పష్టంగా కనిపిస్తుంది. జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు మత ఘర్షణలను పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. అలాంటి దేశాలపై చర్యలు తప్పనిసరి. భారత సైన్యం తగిన సమయంలో తగిన స్థాయిలో బదులిచ్చింది. దీనికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఉగ్రవాదం లేని సమాజం కోసమే బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది” అన్నారు.
అలానే, తాను తెలియజేసిన మరో ముఖ్యాంశం ఏమిటంటే ఈ నెల 9న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర యువనేత కేటీఆర్ ఖమ్మం జిల్లాకు పర్యటన చేస్తారని చెప్పారు. ఆయన రాయల శేషగిరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. స్వల్ప అనారోగ్యం కారణంగా కేటీఆర్ హెలికాప్టర్లో పర్యటన చేస్తారని వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ —
సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించామని, రాయల శేషగిరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల బీఆర్ఎస్ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ఇటీవల అకాల వర్షాల వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సీసీఐ పత్తి కొనుగోళ్ల గోలుమాలపై రాష్ట్ర నాయకత్వం వెంటనే స్పందించాలని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, మాజీ రాష్ట్ర చైర్మన్ కొండ బాల కోటేశ్వరరావు, డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, బీఆర్ఎస్ నగర, మండల అధ్యక్షులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.








