Mahaa Daily Exclusive

  మున్నాల ముచ్చటగానే మిగిలిన పోచారం బ్రిడ్జి అప్పటి ప్రజాప్రతినిధుల సహకారంతో నిధులు మంజూరు ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నాసిరక నిర్మాణ పనులు చేపట్టడంతో బయటికి తేలిన ఇనుప రాడ్లు, ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు. తక్షణమే బ్రిడ్జి మరమ్మతుల పనులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పోచారం, తుర్కగూడ గ్రామాలను కలిపే బ్రిడ్జి నిర్మాణ పనులలో లోపాలు ఏర్పడుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా, పోచారం గ్రామ సమీపంలో ఇబ్రహీంపట్నం చెరువులోకి నీరు వచ్చే పెద్దవాగు పై బ్రిడ్జి నిర్మాణ పనులు గతంలో చేపట్టారు. అప్పటి అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చే ముడుపులకు ఆశపడి నాసిరకం నిర్మాణ పనులు చేపట్టడంతో బ్రిడ్జి పై పగలు ఏర్పడి ఇనుప ఇనుప రాడ్లు బయటి ఎళ్లిన సంఘటన చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం కప్పాడు, తుర్కగూడ, పోచారం గ్రామాల మీదుగా హైదరాబాద్ వెళ్లడానికి వీలుగా ఉంటుందని, పోచారం వాగు పై అప్పటి ప్రజాప్రతినిధుల పొద్బలంతో, ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడితే, అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్ కు ఆశపడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ముఖం చాటేశారు. బ్రిడ్జి నిర్మాణం పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్ల కాంట్రాక్టు దారులు ఆడింది ఆట పాడింది పాటగా ప్రవర్తిస్తూ నాసిరకంగా నిర్మించడం వల్ల బ్రిడ్జిపై కాంక్రీట్ తేలిపోవడంతో ఇనుప రాడ్లు బయటికెళ్లి ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రిళ్ళు వాహనదారులు అటుగా రావాలంటే జెంకుతున్నారు. తేలిన ఇనుపరాట్ల రాడ్లతో ఎక్కడ ప్రాణాలు హరిస్తాయోనని, అటుగా వాహనదారులు రాలేకపోతున్నారు. ప్రతిరోజు వాహనదారులు నరకయాతన అనుభవిస్తూ, రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న పట్టించుకున్న నాధులే కరువయ్యారని, ప్రజలు వాపోయారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నాసిరకంగా బ్రిడ్జి పనులను చేపట్టారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్న ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని,
ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే మరమ్మతులు చేపట్టి, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, పోచారం గ్రామానికి చెందిన భాను ప్రకాష్ ప్రభుత్వాన్ని కోరారు

Latest