కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం , అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తుందని , ఆ దిశలోనే 2014 నుండి పంటల మద్దతు ధరను గణనీయంగా పెంచుకుంటూ వస్తుందని, ప్రస్తుత ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం , రైతుల పెట్టుబడిపై 50శాతం లాభం ఉండేలా ధరలు పెంచడం రైతులకు గుడ్ న్యూస్ లాంటిదని బిజెపి పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు కోసం రూ.2.70 లక్షల కోట్లు కేటాయించిందని , క్వింటా వరి మద్దతు ధర రూ.69కి పెంచిరూ.2,369గా నిర్ణయించిందని తెలిపారు.2025-26 ఖరీఫ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ (ఎమ్ ఎస్ పి) కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆమోదం తెలియజేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
వరి సాధారణ, గ్రేడ్ ఏకి క్వింటా రూ.69 పెంపుతో పాటు జొన్నలు క్వింటా రూ. 328 ,సజ్జలు క్వింటా రూ.150,రాగులు క్వింటా రూ.596 మొక్కజొన్న క్వింటా రూ.175 ,కందిపప్పు క్వింటా రూ.450 పెసర్లు క్వింటా రూ.86 ,మినుములు క్వింటా రూ.400 ,వేరుసెనగ క్వింటా రూ.480 పొద్దుతిరుగు క్వింటా రూ.441 ,సోయాబీన్ క్వింటా రూ.436 ,కుసుములు క్వింటా రూ.579 ,ఒలిసెలు క్వింటా రూ.820 ,పత్తి క్వింటా రూ.589 లతో మద్దతు ధర పెరుగుదల జరిగిందన్నారు. సగటు ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర పెంపు జరిగిందని పేర్కొన్నారు.








