రంగారెడ్డి జిల్లా ప్రాథమిక మహా:
14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను రికార్డు స్థాయిలో పెంచిన నరేంద్ర మోడీ, రైతుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, అమీర్ పేట్ గ్రామంలోని అటల్ జీ వ్యవసాయ క్షేత్రంలో, బిజెపి కిసాన్ మోర్చా నాయకులు రైతులతో కలసి 14 రకాల పంటలకు నిన్న క్యాబినెట్ సమావేశంలో కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచినందుకు, ప్రధానమంత్రి మోడీకి అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ చిత్రపటానికి రైతులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం ఆయన విలేకరులు సమావేశం మాట్లాడుతూ… 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి నేటి వరకు దఫాల వారీగా కనీస మద్దతు ధరను రికార్డ్ స్థాయిలో పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిధి అని ఆయన అన్నారు. భారతదేశ అభివృద్ధి వ్యవసాయంపై ఆధారపడి ఉన్నదని నరేంద్ర మోడీ విశ్వసిస్తున్నారని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆలోచనతోనే రైతాంగానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న ప్రభుత్వం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమని శ్రీధర్ రెడ్డి అన్నారు. రసాయన ఎరువుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగినప్పటికీ పాత ధరలకే రసాయన ధరలను అందించడంతోపాటు, వ్యవసాయ రంగంలో నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము నూతన వంగడాల ఆవిష్కరణ దిశగా, ప్రగతి పథంలో వ్యవసాయాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానంగా తెలంగాణలో వరి, ప్రత్తి వంటి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని వారికి మద్దతు ధరల పెంపు తీపి వార్తగా శ్రీధర్ రెడ్డి అభివర్ణించారు. పత్తికి క్వింటాలకు 589, వడ్లకు క్వింటాలకు 69, జొన్నలకి క్వింటాలకు 328 రూపాయలు, వేరుశనగ క్వింటాలుకు480, మొక్కజొన్న క్వింటాలకు175, ఇలా 14 రకాల పంటలకు గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం శుభదాయకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శాసనసభ ఎన్నికల సమయంలో అన్ని రకాల పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించి, మాట తప్పడం విచారకరమని, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అండగా నిలబడాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పాండిచ్చేరి కిసాన్ మోర్చా ఇంచార్జ్ పాపన్న గౌడ్, మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్, అటల్ బిహారీ వాజ్పేయి వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులు, హరిబాబు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దే సుదర్శన్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్కా రవీందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి నిరంజన్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ యాదవ్ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాసాని వెంకటేష్ గౌడ్ గుంత లక్ష్మయ్య బిజెపి మండల అధ్యక్షుడు యాదేశ్ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు








