రంగారెడ్డి జిల్లా పరిధి మహా:
ఎమ్మార్పీఎస్ అన్ని విభాగాల కార్యకర్తల ఆధ్వర్యంలో చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రంగారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు తుడుం కిరణ్ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ ఆమనగల్ మండల అధ్యక్షుడు కావలి శ్రీశైలం మాదిగ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు తుడుం కిరణ్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుండి జాతి కోసం ఉద్యమ పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది.
ఎంఆర్పిఎస్ దండోరా ఉద్యమంలో సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తించి. ఈనెల 27 న ఢిల్లీలో మందకృష్ణ మాదిగకు అత్యున్నత అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఈనెల 31వ తేదీన వరంగల్ కు చేరుకుంటారు. యావత్ మాదిగ జాతి మొత్తం జాతి మహాత్ముడైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుదాం. ర్యాలీ విజయవంతం చేయడానికి రంగారెడ్డి జిల్లాలోని, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల, గ్రామం నుండి జన సమీకరణతో 31తేదీన చలో వరంగల్ కు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ కి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరి డ్రెస్ కోడ్ ధరించి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఆమనగల్ మండల అధ్యక్షులు కావలి శ్రీశైలం మాదిగ, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాదిగ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జంతిక విజయ్ కుమార్ మాదిగ, సీనియర్ నాయకులు విజయ చందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.








