Mahaa Daily Exclusive

  పోచ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించిన కంది శ్రీ‌నివాస రెడ్డి

Share

దిలాబాద్, మహా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి బేల మండ‌లంలో పర్యటించారు. సోమవారం అవల్ పూర్ గ్రామాన్ని సంద‌ర్శించారు. గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఆయ‌న‌కు ఘన స్వాగ‌తం పలికారు. గ్రామంలోని పోచ‌మ్మ ఆల‌యంలో నూతనంగా ప్రతిష్టించిన అమ్మ‌వారిని ద‌ర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయ‌న వెంట ఆదిలాబాద్, బేల మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.