రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా అన్ని వర్గాల ప్రముఖులను పిలవాల్సిన ప్రభుత్వ అధికారులు ఎలా మర్చిపోతారని అన్నారు. ఉప్పరిగడ్డ మాజీ సర్పంచ్ చందు నాయక్ మాట్లాడుతూ… వీళ్ళు చదువుకున్న అధికారులే కదా మరి వీళ్ళ తెలివి ఎక్కడికి పోయింది. తెలంగాణ ఉద్యమకారునిగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అంజయ్య యాదవ్ ను ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు ఆహ్వానం ఇవ్వకుండా వారి ఇష్టనుసారంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని తెలిపారు. పాలకపక్షానికి వత్తాసు పలకడం ప్రభుత్వ అధికారులకు అలవాటుగా మారిందని, ఇది మంచి సంస్కృతి కాదని, పదవులు ఎవ్వరికి ఎప్పటికి శాశ్వతం కావని అది గుర్తుపెట్టుకొని మసలుకోవాలని అన్నారు. గతంలో ఎన్నడడూ కూడా అధికారులు ఇలా వ్యవహరించలేదని ఇప్పుడు కొత్తగా ఇదేమి పద్ధతో అధికారులు తెలుపాలని అన్నారు. ఎంఆర్ఓ, ఆర్డిఓ ఆఫీస్, ఎంపీడీఓ కార్యాలయాల నుండి మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ ప్రజాప్రతినిధులను ఎందుకు ఆహ్వానం అందజేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకొని ప్రభుత్వ సంప్రదాయాలను, మర్యాదలను పాటించాలని సూచించారు.








