Mahaa Daily Exclusive

  ప్రజల భాగస్వామ్యం తోనే వంద రోజుల ప్రణాళిక విజయవంతం నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..!

Share

వరంగల్ మహా;

ప్రజల భాగస్వామ్యం తోనే వంద రోజుల ప్రణాళిక విజయవంతం అవుతుందని నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో 100 రోజుల ప్రణాళిక అమలు పై తెలంగాణ రైజింగ్ 2047′ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ,మేయర్, కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే తో కలిసి పాల్గొని ఇందుకోసం రూపొందిన పోస్టర్ ను ఆవిష్కరించి కార్యక్రమ అమలుకు సంబంధించిన ప్రతిజ్ఞను అధికారులు, సిబ్బంది చే నిర్వహింపజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నగరం పచ్చదనంగా పరిశుభ్రంగా ఉండాలని ఆకాంక్షించి 100 రోజుల కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని, నగరాల్లో అమలు చేయాలన్న సంకల్పం తో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ మార్గ నిర్దేశం ప్రకారం వంద రోజులలో చేపట్టే కార్యక్రమాలను మున్సిపల్ కార్పొరేషన్ తరపున చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగం గా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలను నాటడం, భువన్ అప్ ద్వారా భవనాల వాస్తవ విస్తీర్ణ సమాచార నమోదు, పన్నులు చెల్లించడం, వర్షాకాలం నేపథ్యంలో నగరం ముంపుకు గురికాకుండా వంద రోజులపాటు నిరంతరం గా డిసిల్టేషన్ కార్యక్రమాలను నిర్వహించడం, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా మలేరియా విభాగం నుండి ఫాగింగ్ తో పాటు దోమల నియంత్రణకు మురికి నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం గంబుసియ చేపలను పెంచడం, జంక్షన్ల అభివృద్ధి చేయడం, నగరం లో రెండు ఒక పార్కులను ఎంపిక చేసుకొని వారంలోగా అభివృద్ధి చేసి ప్రారంభించుకోవడం, బల్దియా తరఫు నిరంతరం కొనసాగే కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం సూచించిన 100 రోజుల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను 66 డివిజన్ల వ్యాప్తం గా ఆయా డివిజన్ ల కార్పొరేటర్లు వారి డివిజన్ లలో అధికారులు సిబ్బంది సమన్వయంతో చేపట్టి 100 రోజుల్లో వరంగల్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా క్లీన్ సిటీ గా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని అన్నారు. ప్రజల భాగస్వామ్యం తోనే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని, కార్పొరేటర్లు, అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి 100 రోజుల కార్యక్రమాల్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని, కమిషనర్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా
కమిషనర్ మాట్లాడుతూ ఎం ఏ యు డి నుండి నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, విభాగాలలో స్పెషల్ యాక్టివిటీస్ లో భాగం గా డీసిల్టేషన్ డ్రైన్ లలో చెత్తను తొలగించడం, వాటర్ ట్యాంకులను శుభ్రపరచడం తో పాటు శానిటేషన్ కార్యక్రమంలో భాగం గా 100 రోజుల ప్రారంభం సందర్భంగా నగరంలోని ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సిబ్బందికి పి పి ఈ కిట్ లను మేయర్,ఎమ్మెల్యే కమిషనర్ అందజేశారు.
వందరోజుల కార్యక్రమ అవగాహన పై ఏర్పాటుచేసిన ర్యాలీని మేయర్ ఎమ్మెల్యే, కమిషనర్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది ప్లకార్డులు చేతబూని కొనసాగిన ర్యాలీ
కే ఎం సి వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.