Mahaa Daily Exclusive

  కేంద్ర ప్రభుత్వ ఇంటిలిజెన్స్ ఫేల్యూర్ పై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు -టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..!

Share

కేంద్ర ప్రభుత్వం షాక్ లో ఉంది .

పహాల్గామ్ వచ్చి మన టూరిస్ట్ లను చంపితే కేంద్ర ప్రభుత్వ ఇంటిలిజెన్స్ ఏం చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వ ఇంటిలిజెన్స్ ఫేల్యూర్ పై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు.

కేంద్ర ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది .

మీ తప్పు ను తప్పిపుచ్చుకునేందుకే రాహుల్ గాంధీ పై విమర్శలు.

కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇంత నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో అర్దం కావడం లేదు.

మోడీ , పాకిస్థాన్ ను ఏదో చేస్తడని భావిస్తే…ఏం చేసాడు .

సీజ్ ఫైర్ గురించి మోడీ మాట్లాడాలి… కానీ ట్రంప్ ఎందుకు ప్రకటన చేసాడు.

మోడీ చెప్పాల్సింది… ట్రంప్ చెప్తే..కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు సిగ్గు అనిపిస్తలేదా…

కేంద్ర ప్రభుత్వం కు మా మద్దతు అని రాహుల్ గాంధీ బహిరంగంగా చెప్పారు… ఇంతకంటే ఏం చేయాలి.

1971 లో అమెరికా ప్రెసిడెంట్ బెదిరించినా ఇంధిరా గాంధీ తలొగ్గలేదు.

మోడీ యుద్ధం లో ఫేలయ్యారనే భావన ప్రజల్లో ఉంది.

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇంటికి వెల్లి నవాజ్ షరీఫ్ తల్లి కాళ్ళు మొక్కింది మోడీ కాదా..

అదే రోజు వాజ్ పయ్ పుట్టినరోజు… కానీ వాజ్ పయ్ నిపట్టించుకోలేదు… దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి.

బండి సంజయ్, కిషన్ రెడ్డి మరోసారి రాహుల్ గాంధీ ని విమర్శిస్తే…కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుంది.

రాహుల్ గాంధీ పై తప్పుడు ప్రచారం చేసినందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే..

ప్రతిపక్ష నాయకునిగా యుద్ధం వల్ల జరిగిన లాభ ,నష్టాలను అడిగితే తప్పా..

ప్రతిపక్ష నేతగా దేశ ప్రజల ఆస్తుల లెక్కలు అడగాల్సిన భాధ్యత రాహుల్ గాంధీ పై ఉంది..

పీవోకే ను కాంగ్రెస్ ఎందుకు స్వాదీన పరుచుకోలేదని అడుగుతున్నా బీజేపీ… ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్వాదీన పరుచుకోలేదు.

26 మందిని చంపిన ఉగ్రవాదులను పట్టుకోకుండా కాంగ్రెస్ పై విమర్శలా..

బీజేపీ నేతలకు తలకాఉంది కానీ మెదడు లేదు.

పాకిస్థాన్ పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే బీజేపీ పని.