వరంగల్ మహా;
బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ జిల్లా కార్యాలయం ధర్మారంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారందరికీ నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ప్రజల శ్రమ, త్యాగం, ఆత్మగౌరవానికి ప్రతీకగా అవతరినించిన చారిత్రాత్మక మైలురాయని మన పోరాట శక్తిని, ప్రజల అభివృద్ధి లక్షాన్ని, ఆత్మగౌరవాన్ని గర్వంగా గుర్తుచేసే పవిత్రమైన రోజు అని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణకు బిజెపి మద్దతు ఇవ్వడంలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె పార్లమెంట్లో తెలంగాణ గొంతుకను బలంగా వినిపించారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారని, 2017 చివర్లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో మాట్లాడిన ఆమె ‘‘నేను మీ తెలంగాణ చిన్నమ్మను’’ అనగానే సభ చప్పట్లతో మార్మోగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతుందని, తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతుందని ఆ తల్లి పడుతున్న వేదనను అర్థం చేసుకున్న సుష్మ స్వరాజ్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో గల్లీ నుంచి ఢిల్లీ వేదికల వరకు పదే పదే చెబుతూ రాష్ట్ర ఏర్పాటుకు మొదట నుంచి అండ దండగా ఉంటూ వచ్చిన మహిళ నేత సుష్మ స్వరాజ్ . ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతి ఆందోళనలకు హాజరై రాష్ట్ర ఏర్పాటుకు తొలి నుంచి ఆమె అండగా నిలబడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందేనని పట్టుబట్టి మద్దతుగా నిలిచారు. మన రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు,ఎన్నో త్యాగాల మీద విద్యార్థుల బలిదానాల మధ్య అనేక మంది ప్రజా పోరాటాలతో తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు బైరి మురళి కృష్ణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, గడల కుమార్, పైర్ధ ఆనంద్, జిల్లా కోశాధికారి కూచన క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి బైరి శ్యాంసుందర్, కార్యాలయ కార్యదర్శి కంది క్రాంతి కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎర్రగోళ్ల భరత్ వీర్, బిజెపి సీనియర్ నాయకులు మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, బుద్ధ శ్రీనివాస్ బిజెపి నాయకులు చిలువేరు రాజేందర్, ముండ్రాతి వెంకటేశ్వర్లు, కోమాకుల నాగరాజు, మార్త ఉషారాణి, కొంతం సంగీత్, కందుకూరి శ్రీనివాస్, గోదాసి అశ్విన్ తో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








