రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన రెడీమిక్స్ లారీ, తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరిక. శుక్రవారం మధ్యాహ్న సమయంలో, యాచారం మండలం, గునగల్ గ్రామానికి చెందిన ధార మహేందర్ అనే వ్యక్తి వండర్లా నుంచి కొంగరకలాన్ వెళ్లే మార్గమధ్యలో, కలెక్టరేట్ టీ జంక్షన్ వద్దకు రాగానే, అతివేగంగా వచ్చిన రెడీమిక్స్ వాహనం, మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతని, స్థానికులు 108కు ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న అంబులెన్స్ లో నగరంలోని కామినేని హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు, ఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
కలెక్టరేట్ వెళ్లే దారిలో ఈ ప్లాంట్లు ఉండడం గమనార్హం….
రెడీమిక్స్ వాహనాలతో తరచూ ప్రమాదాలు…
కొంగరకలాన్, సాహెబ్ గూడ పరిధిలో రెడీ మిక్స్ ప్లాంట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. అరకొరా అనుమతులతో ఈ ప్లాంట్ల నిర్వహణ కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వండర్లా నుంచి మంగళపల్లి మీదుగా సాగర్ హైవేకు వెళ్లే మార్గంలో రెడీమిక్స్ వాహనాలు అతివేగంతో వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే దారిలో రెడీమిక్స్ ప్లాంట్లు ఉండడం గమనార్హం. ప్రతిరోజు జిల్లా అధికారులు ఈ మార్గంగుండా వెళ్తూ ఉంటారు. తరచూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో, రెడీ మిక్స్ ప్లాంట్ల నిర్వాహకులతో అధికారులు చర్చించి, ఈ ప్లాంట్లను వేరొక చోటికి తరలించేలా చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులను కోరుచున్నారు.








