హనుమకొండ, వరంగల్ మహా
ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వైద్య, విద్య కళాశాలలకు ఎన్ఎంసి నిబంధనల మేరకు సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, తెలంగాణ ప్రభుత్వం నియమించిన కేఎంసి,నర్సంపేట,జనగామ వైద్య కళాశాలల పర్యవేక్షణ కమిటీ ఛైర్పర్సన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు.
శుక్రవారం వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో వరంగల్,
హనుమకొండ జిల్లాల కలెక్టర్లు
డాక్టర్ సత్య శారద స్నేహ శబరీష్, లతో కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ మోహన్ దాస్, వివిధ విభాగాధిపతులు, హనుమకొండ వరంగల్ జిల్లాల్లోని అనుబంధ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ప్రభుత్వ ఆసుపత్రులలో వసతుల కల్పనకు కావలసిన వివిధ అంశాలపై కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా కాకతీయ మెడికల్ కళాశాలలో బోధన, బోధనేతర, ల్యాబ్, సిబ్బంది, కావాల్సిన వసతులపై సమీక్షించారు. కేఎంసిలోని హేమటాలజి విభాగాన్ని, వైద్య విద్యార్థినుల వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి వాటిని గురించిన వివరాలను ప్రిన్సిపల్ రామ్ కుమార్ రెడ్డిని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేఎంసి లో ఉన్న ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన (పిఎంఎస్ఎస్ వై ) ఆసుపత్రిలోని పలు విభాగాలను జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో కలిసి కమిషనర్ సందర్శించి అక్కడున్న వనరులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించి ఓపి విభాగం, ఆరోగ్యశ్రీ, లేబర్ రూమ్, నియోనాటల్ వార్డ్ ల ను కమిషనర్ సందర్శించి ఆయా వార్డుల వివరాలు, ఓపి సేవలు, రిఫరల్స్, ఫాలో అప్, ప్రసూతి సేవలను గురించి, వైద్యులు సిబ్బంది, తదితర వివరాలను వైద్యాధికారులను కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ సమీపంలోని ప్రభుత్వ ఛాతి, క్షయ వ్యాధుల ఆస్పత్రిని కమిషనర్ సందర్శించి అక్కడికి వస్తున్న పేషంట్స్, అందిస్తున్న ఓపి సేవలను గురించి ఏ విధంగా మెడికల్ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారు, ఎలా తరలిస్తున్నారనే వివరాలను సంబంధిత వైద్యాధికారులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. వరంగల్ ఎంజీఎం తో పాటు సికేఎం ఆస్పత్రులను సందర్శించి వాటి వివరాలను, సమకూర్చాల్సిన సౌకర్యాలను గురించి వైద్యాధికారులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమీక్ష సమావేశంలో వివిధ విభాగాల్లో వనరుల కొరత, యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఎన్ఎంసి నిబంధన ప్రకారం ఉండాల్సిన, సమకూర్చాల్సిన సౌకర్యాల గురించి కూలంకషంగా చర్చించారు. కాకతీయ మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాల గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.
వరంగల్ ఎంజీఎం, ఆస్పత్రిని ఓపి విభాగాలను సందర్శించి ప్రతిరోజు ఎంతమంది ఓపి సేవలకు వస్తుంటారని, ఓపి నమోదు కోసం ఎన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారని కమిషనర్ పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలోని ఈ ఔషధీ కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. అదేవిధంగా ఎంజీఎం ఆసుపత్రిలో ఓపి సేవల విభాగంలో అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంజీఎం ఆస్పత్రుల్లోని నియోనాటల్ వార్డులను, వంట గదిని సందర్శించి అక్కడున్న సౌకర్యాలు, కావలసిన పరికరాలు, డాక్టర్లు, నర్సుల వివరాలు కమిషనర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిని
సందర్శించి ఓపి విభాగం, ఆరోగ్యశ్రీ, లేబర్ రూమ్, నియోనాటల్ వార్డ్ ల ను కమిషనర్ సందర్శించి ఆయా వార్డుల వివరాలు, ఓపి సేవలు, రిఫరల్స్, ఫాలో అప్, ప్రసూతి సేవలను గురించి, వైద్యులు సిబ్బంది, తదితర వివరాలను వైద్యాధికారులను కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ వరంగల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ అప్పయ్య, డాక్టర్ సాంబశివరావు, టీజీఎంఐడిసి ఈఈ ప్రసాద్, కేఎంసి ఏడి రమేష్, ప్రసాద్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరి, సికేఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షర్మిల, ప్రభుత్వ ఛాతి, క్షయ వ్యాధుల ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భరత్ కుమార్, తదితరులు, పాల్గొన్నారు.








