Mahaa Daily Exclusive

  కొడాలి నానికి ముందస్తు బెయిల్ మంజూరు..!

Share

AP: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి భారీ ఊరట లభించింది. ఆయనకు మాజీ MLA రావి వస్త్ర దుకాణంపై దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్‌ వచ్చింది. గుడివాడ కోర్టు  షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి మంగళ,శనివారాల్లో గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయడం కోసం రావాలని షరతులు కోర్టు పెట్టింది. కాగా, కొడాలి నాని ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.