మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన చిటుకూరి మల్లేష్ అనే పారిశ్రామికవేత్తకు గౌరవ డాక్టరేట్
అవార్డు వరించడం పట్ల సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గు పరిశ్రమ ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం హైద్రాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో
ఆపరేషన్ బిజినెస్ విభాగంలో
గౌరవ డాక్టరేట్ ను డిల్లీ యూనివర్సిటీ ప్రధానం చేసింది. మల్లేష్ గత 12 సంవత్సరాలుగా సింగరేణి అనుబంధ పరిశ్రమలో రూప్ బోల్ట్, కన్వేయర్ రోలాక్స్
తయారీ కంపెనీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ కార్మికుల పిల్లలు పరిశ్రమలు నడుపుకొనుటకు ఇచ్చిన అవకాశాన్ని ఆయన ఏకాగ్రతతో నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు, సింగరేణి కార్మికులు
చిటుకూరు మల్లేష్ ను అభినందించారు. గతంలో ఇతడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున టి ప్రైడ్ బెస్టు ఆంట్రీ ప్యూనర్ అవార్డును అందజేసింది. రానున్న రోజుల్లో సింగరేణి యాజమాన్యం మరికొన్ని సింగరేణి అనుబంధ పరిశ్రమలను స్థాపించుటకు కృషి చేయాలని సింగరేణి ఉద్యోగులు కోరుతున్నారు.







