ఆదిలాబాద్, మహా
సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల వారీగా 98దరఖాస్తు లు వచ్చాయని వీటిపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామల దేవి, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర తదితరులు పాల్గొన్నారు.
Post Views: 21








