Mahaa Daily Exclusive

  జీపీఎఫ్, టీఎస్ జిఎల్ఐ బిల్లులను విడుదల చేయాలి..!

Share

ఆదిలాబాద్, మహా
ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న జీపీఎఫ్, టీఎస్ జీఎల్ఐ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక డైట్ కళాశాలలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులతో తనిఖీ చేసే చర్యలను వెంటనే మానుకోవాలని స్పష్టం చేశారు. ఐటీడీఏ యాజమాన్యంలోని ఏజెన్సీ డీఈఓ పోస్టులను మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు. పాఠశాలల్లో నిరూపయోగంగా ఉన్న ఆర్ఓ ప్లాంట్లను రిపేర్ చేసి, శుద్ధిచేసిన తాగునీటిని అందించాలని పేర్కొన్నారు. జాతీయ నూతన విద్యా విధానం అశాస్త్రీయంగా, మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా ఉందని దేశంలో కుల వ్యవస్థను స్కిల్ యూనివర్సిటీల పేరుతో పునర్ నిర్మించే విధంగా ఉందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే పనిలో భాగంగానే బడ్జెట్లో నిధులు తగ్గిస్తున్నాయని మండిపడ్డారు. విద్యా కమిషన్ కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ వారు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలతో పేద ప్రజల పిల్లలు చదువుకునే బడులను ధ్వంసం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ నాయకులు శ్రీనివాస్, దిలిప్,వృకోధర్,నాగేందర్,
సాయికాంత్,సంతోష్,నగేష్,శుద్ధోదన్,కిషోర్ పాల్గొన్నారు