Mahaa Daily Exclusive

  ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరు చేయాలి..!

Share

ఆదిలాబాద్, మహా
ఐటీడీఏ ఆధ్వర్యంలో సీసీడీపీ నిధులతో కొలాం, తోటి లబ్ధిదారుల కోసం నిర్మించిన ఇళ్లకు సంబంధించి బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఆదివాసీ పీవీటీజీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సుమారు వెయ్యి ఇళ్లు మంజూరు కాగా లబ్ధిదారులు సొంత ఖర్చుతో, అప్పులు చేసి నిర్మించుకున్నారని తెలిపారు. 2023-24 ఏడాదిలో ఇంటి నిర్మాణాలు పూర్తయినప్పటికీ బిల్లులు మంజూరు కావడంలేదని లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వెంటనే అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కోకన్వీనర్లు కుడ్మెత తిరుపతి, మర్సుకోల బాపురావు, మేస్రం జైరాం, ఉపాధ్యక్షుడు టేకం వసంత్ రావు ఉన్నారు.