Mahaa Daily Exclusive

  రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు నారాయణ పాఠశాల విద్యార్థుల ఎంపిక.”..!

Share

ఖమ్మం సిటీ, మహా.
ఖమ్మం నగరం లోని కవిరాజ్ నగర్ , వీధి నెంబర్ : 13 లో గల నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు . బాస్కెట్ బాల్ గేమ్ అండర్ 18 విభాగంలో కుంచె చరణ్ నాయుడు , అథ్లెటిక్స్ లో అండర్ 12 విభాగంలో ఇ. వరుణ్ లు ఎంపికయ్యారు . ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నారాయణ విద్యాసంస్థల ఏ.జి.యం యస్. రాంకీ ఎంపికైన విద్యార్థుల పట్ల హర్షం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యస్. అమలోద్భవి మాట్లాడుతూ క్రీడలు శారీరక ఎదుగుదలకే కాకుండా మానసిక వికాసానికి కూడా ఎంతో తోడ్పడతాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఆర్ ఐ క్రాంతి కుమార్ , కో ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, డీన్ మాధవరావు , ఏవో నాగేశ్వరావు , పిఈటి చందుతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు .