కూసుమంచి, జూన్ 30, మహా:
పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలోని ధర్మతండాకు చెందిన జర్పుల పరుశురాం సోమవారం మరణించడంతో విషయం తెలుసుకున్న కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జర్పుల పరుశురాం పార్తివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి పొంగులేటి శీనన్న ఆత్మీయ భరోసా రూ.10,000లను అందజేశారు. గతంలో పరుశురాం కూతురు ఆక్సిడెంట్ కు గురికావడం మనకు తెలిసిన విషయమే, ఆ పాపా యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కూడా భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ తండా గ్రామ నాయకులు, వడిత్య కుమార్, దారవత్ సురభి నాయక్, జర్పుల సురేష్, బాణోత్ రవి, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post Views: 80








