కూసుమంచి, జూన్ 30, మహా:
అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, పాలేరు సిపిఎం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఎడవల్లి పద్మా రెడ్డి భవన్ లో మండల కమిటీ సమావేశం బిక్కసాని గంగాధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..బేస్ మట్టం పూర్తి అయిన ఇండ్లకు మొదటి విడతగా లక్ష రూపాయలు వెంటనే ఇవ్వడంతో పాటు ఇసుకను కూడా ఉచితంగా ఇవ్వాలని అన్నారు.దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే కార్మిక కర్షక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ గ్రామస్థాయి, మండల స్థాయి అన్ని వర్గాల కార్మికులు కర్షకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలలో ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ప్రకటించిన తర్వాత ఇనుము, ఇసుక, సిమెంటు రేట్లు విపరీతంగా పెరిగాయని, ఇళ్ల నిర్మాణం కోసం ప్రకటించిన 5 లక్షల నిధులు సరిపోవని గత రేట్ల ప్రకారం ఇనుము సిమెంటును సప్లై చేయాలని , ఇసుక కూపన్లకు పరిమిత సమయం పెట్టడాన్ని తీసివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యంకు రైతుకు బోనస్ వెంటనే విడుదల చేయాలని , కౌలు రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు ఎంసన్మంతరావు, మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్ ( రాజు) కార్యదర్శివర్గ సభ్యులు శీలం గురుమూర్తి, గన్య నాయక్, టి వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, మండల కమిటీ సభ్యులు చిట్టూరి వెంకన్న, చీర్ల రాధాకృష్ణ, గోపే వెంకన్న, జివ్వాది శ్రీను ఉపేందర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.







