టేకులపల్లి – మహా :
టేకులపల్లి లో ఏఐకే ఎంఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తుపాకుల నాగేశ్వరావు అధ్యక్షత వహించారు. ఏఐకెఎమ్ఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి, కోటేశ్వరరావు, అధ్యక్షులు మామిడాల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న పాల్గొన్నారు… ఈ సందర్భంగా మండల వెంకన్న మాట్లాడుతూ… రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతులకు సరిపడ విత్తనాలను ప్రభుత్వం అందించకపోవడం వలన 95 శాతం విత్తనాల కోసం రైతులు ప్రైవేటు కంపెనీల పైననే ఆధారపడాల్సి వస్తుంది. బెల్టు షాపుల్లాగా రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు.. వీటిపై సరియైన పర్యవేక్షణ లేకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ప్రభుత్వము, సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని నకిలీ విత్తన దందాను అరికట్టాలని, పరివేక్షణ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.. యూరియా కొరత తీవ్రంగా ఉందని.. ఇతర ఎరువుల కొరత కూడాఉంది.. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ పరిధిలో ఎరువులను అందుబాటులో ఉంచాలని.. రైతు పనులకు ఆటంకం కలుగకుండా విత్తనాలు ఎరువులను నాణ్యమైన వాటిని యుద్ధ ప్రాతిపదికన అందజేయాలని కోరాడు… రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి మాట్లాడుతూ రైతులకు సరిపడా పెట్టుబడులు ప్రభుత్వం నుండి అందకపోవటం వలన ప్రైవేట్ వ్యాపారులు అధిక వడ్డీలతో రైతులను దోపిడీ చేస్తున్నారు… దీనివలన రైతు పంటపై వ్యాపారుల ఆజిమాషి పెరుగుతుంది.. దీనిని నివారించాలి అంటే ప్రభుత్వమే పెట్టుబడులను సమకూర్చాలి.. వారి పంటకు గిట్టుబాటు ధరలను కల్పించాలి… కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే నూతన మార్కెట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని.. వారు డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో భూక్య అర్జ, ఎస్ కే ఉమర్, బట్టు ప్రసాద్, సువర్ణపాక నాగేశ్వరరావు, ఎట్టి నరసింహారావు, భూక్య నర్సింగ్, కల్తీ సీతారాములు, బత్తిని సత్యం తదితరులు పాల్గొన్నారు.








