Mahaa Daily Exclusive

  బుగ్గమఠం భూముల విషయంలో పెద్దిరెడ్డికి ఊరట..!

Share

AP: బుగ్గమఠం భూముల విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊరట లభించింది. బుగ్గమఠం భూములను ఖాళీ చేయాలని దేవాదాయ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఏ భూములైతే బుగ్గమఠం భూములని చెబుతున్నారో, వాటి రికార్డులన్నింటినీ పెద్దిరెడ్డికి అందజేయాలని మఠం ఈవోను ఆదేశించింది. రికార్డులు తీసుకున్న తర్వాత ఆ భూములపై వివరణ ఇవ్వాలని పెద్దిరెడ్డిని ఆదేశించింది.