Mahaa Daily Exclusive

  సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు డీజేకు నో పర్మిషన్..!

Share

తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల పండుగ మొదలైంది. జూలై 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని డీసీపీ రష్మీ స్పష్టం చేశారు. బోనాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆమె, భక్తుల భద్రత కోసం 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.

Latest