Mahaa Daily Exclusive

  త్వరలో సరికొత్తగా చిన్నారులకు బాలామృతం: మంత్రి సీతక్క

Share

TG: శిథిలావస్థలోని అంగన్‌వాడీ భవనాలను సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి తరలించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్‌వాడీల బలోపేతానికి ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల సహకారం కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిపుణుల సిఫార్సు మేరకు చక్కెర లేకుండా, ఖర్జూర పౌడర్‌తో సరికొత్త బాలామృతం సిద్ధం చేసి త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు.