Mahaa Daily Exclusive

  ఇవాళ, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన..!

Share

మాజీ సీఎం జగన్ సోమ, మంగళవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం 7.30కు ఇడుపులపాయకు బయలుదేరి, దివంగత నేత వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొని.. ఆ తరువాత పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుసుకోనున్నారు.