రంగారెడ్డి జిల్లా మహా:
మత సామరస్యానికి త్యాగాలకు ప్రతీక మొహర్రం పండుగ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో జరిగిన మొహర్రం వేడుకల్లో వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. గ్రామంలో ముస్లిం హిందూ అనే భేదాభిప్రాయాలు లేకుండా, ప్రతి ఒక్కరు మొహరం పండుగను జరుపుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్య, మార సురేష్, ఎన్నిదుల సురేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు వెదిరే సికిందర్ రెడ్డి, ఎండి గాలేబ్, అజీమ్, జిలానీ, ఇమ్రాన్, గఫార్, జాఫర్, అర్షద్, కుకుడాల నరేందర్ రెడ్డి, పాండాల అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 57







