హన్మకొండ మహా;
హనుమకొండ లోని జవహర్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరించి, క్రీడల పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ “దేశానికి వెన్నుముక నేటి క్రీడాకారులు” అన్నారు. క్రీడా రంగంలో అభివృద్ధి సాధించాలంటే క్రీడాస్పూర్తి అత్యవసరం, ఓటమికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు.రాష్ట్రంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ కేంద్రాలు, కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని తెలిపారు. అనంతరం ఎంపికైన క్రీడాకారులను, కోచ్ లను వేదికపై అభినందించి, గుర్తింపుగా జ్ఞాపికలను బహూకరించారు.







