రంగారెడ్డి జిల్లా మహా:
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం భారతీయ జనతా పార్టీ తుర్కయంజాల్ శాఖ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి క్రమశిక్షణ కమిటీ సభ్యులు, బోసు పల్లి ప్రతాప్ హాజరై, శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బోసుపల్లి మాట్లాడుతూ…. ఒకే దేశంలో రెండు సంవిధాన్లు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదు అనే నినాదంతో కాశ్మీర్ ఈ దేశంలోనే భాగం అని తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకోవడం జరిగింది. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్ష కార్యదర్శిలు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
Post Views: 80







